కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా నిర్వహించిన 'ఆపరేషన్ కగార్-2' లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మరణించిన వారిలో అగ్రనేతలు కూడా ఉన్నట్లు సమాచారం.
కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ తో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిస్పందనగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మృతులలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకులు ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మృతుల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఈ ఘటనతో అటవీ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.












