Kurnool/Nandavaram (డాక్సిన్ టైమ్స్) జూన్ 27
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్., తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్, ప్రధాన ప్రవేశ ద్వారం, కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం జిల్లా పోలీసింగ్, శాంతిభద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత, పోలీస్ సంక్షేమం వంటి అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్., శాంతిభద్రతల విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ మధుసూదన్ రెడ్డి, ఐపీఎస్., గారు ఈరోజు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ సంక్షేమానికి సంబంధించిన పలు మౌలిక వసతుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్, ప్రధాన ప్రవేశ ద్వారం (గ్రౌండ్ గేట్), కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సతీమణి కూడా పాల్గొన్నారు.












