కంబం, 13 September
వైఎస్ఆర్ కడప జిల్లా జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 29 బెంచీల ద్వారా మొత్తం 92,091 కేసులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిష్కారాల ద్వారా కక్షిదారులకు రూ.22.11 కోట్లకు పైగా చెల్లించడం జరిగిందని వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జాతీయ లోక్ అదాలత్ లో 92,091 కేసులు పరిష్కారం: డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ కడప డాక్షిన్ టైమ్స్ . వైఎస్ఆర్ కడప జిల్లావ్యాప్తంగా 29 బెంచీలు గాను మొత్తం 92,091 కేసులు పరిష్కరించబడ్డాయి. వాటిలో 91,236 క్రిమినల్ కేసులు, 201 సివిల్ కేసులు మరియు 654 ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారము కాబడినవి. Rs.22,11,42,448/- (22 కోట్ల 11 లక్షల 42 వేల 448 రూపాయలు) మొత్తము కక్షిదారులకు చెల్లించడం జరిగినది. కడప నందు 6788 కేసులు, పొద్దుటూరు, మైదుకూరు నందు 13627 కేసులు, రాజంపేట నందు 6622 కేసులు, రాయచోటి నందు 3483 కేసులు, బద్వేల్ నందు 5989 కేసులు, జమ్మలమడుగు నందు 13164 కేసులు, సిద్ధవటం నందు 3714 కేసులు, రైల్వేకోడూరు నందు 6074 కేసులు, పులివెందుల నందు 9292 కేసులు, నందలూరు నందు 6040 కేసులు, లక్కిరెడ్డిపల్లి నందు 11240 కేసులు, కమలాపురం నందు 6058 కేసులు జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించబడినవి. జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి తోడ్పడిన అందరికీ పేరుపేరునా జి.రామగోపాల్, చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప, ఎస్.బాబా ఫక్రుద్దీన్, సెక్రటరీ- -సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కృతజ్ఞతలు తెలియజేశారు.












