ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం షాంపూర్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వాగులో పడిపోవడంతో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉట్నూరు మండలం షాంపూర్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బస్సులోంచి బయటకు తీసి, ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












