ప్రొద్దుటూరు-తిరుపతి ఆర్టీసీ బస్సు నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా భాకరాపేట సమీపంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై పశువులను తోలుకెళ్తున్న రైతు తుర్రా శ్రీనివాసులుపైకి బస్సు దూసుకురావడంతో మూడు బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో బర్రె తీవ్రంగా గాయపడింది.
ప్రమాదం జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండా పరారయ్యాడని స్థానికులు తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. మూగజీవాల ప్రాణాలు పోయినా పట్టించుకోని ఆర్టీసీ సిబ్బంది తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఘటనలో రైతు తుర్రా శ్రీనివాసులుకు సుమారు రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేయబడింది. రైతు పోలీసులను సంప్రదించగా, వారు రాజంపేట బస్టాండ్ లో ప్రమాదానికి కారణమైన బస్సును గుర్తించారు.












