పుట్టపర్తి, 19 September
అన్నమయ్య జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సాధారణ వర్షపాతంతో పోలిస్తే 70.5 శాతం లోటు నమోదైందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో నష్టపోతున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అన్నమయ్య జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాయచోటిలోని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.











