కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, 2031 నాటికి చేనేత ఎగుమతులను 10 బిలియన్ డాలర్లకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. న్యూఢిల్లీలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NHDC) 43వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ఈ ప్రకటన చేశారు.
మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ చేనేత ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను మరింతగా పెంచుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దీని కోసం చేనేత కార్మికులకు అవసరమైన శిక్షణ, ఆధునిక యంత్రాలు, మెరుగైన మార్కెటింగ్ వ్యూహాలను అందించడంపై దృష్టి సారిస్తామని ఆయన వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
NHDC 43 ఏళ్లుగా చేనేత రంగానికి అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. ఈ సంస్థ భవిష్యత్తులో కూడా చేనేత కళాకారుల సాధికారతకు, వారి ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.











