దేశీయ స్టాక్ మార్కెట్లలో దీపావళి సందడి కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీలు లాభాలతో ట్రేడ్ అవుతూ మదుపర్లలో ఉత్సాహాన్ని పెంచాయి. ఈ ర్యాలీతో మదుపర్ల సంపద ఒక్కరోజులోనే రూ.6.9 లక్షల కోట్లకు పైగా పెరిగింది.
30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 1,609.54 పాయింట్లు (2.08 శాతం) పెరిగి 78,910.94 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 417.45 పాయింట్లు (1.74 శాతం) లాభపడి 24,378.05 వద్ద ముగిసింది. వరుసగా ఆరు సెషన్లుగా మార్కెట్లు లాభాల బాటలో కొనసాగడం విశేషం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మార్కెట్ల పెరుగుదలకు ఐదు ప్రధాన కారణాలు
1. ముడిచమురు ధరల తగ్గుదల: అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 95 డాలర్ల దిగువకు పడిపోయింది. అమెరికా క్రూడ్ ధర 90 డాలర్ల కంటే దిగువకు చేరింది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌కు ఈ పరిణామం ఊరటనిచ్చింది. దిగుమతి వ్యయం తగ్గుతుందన్న అంచనాలు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.












