ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తన పొదుపు, జీతం ఖాతాలకు సంబంధించిన ఛార్జీలను సవరించింది. నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులతో కనీస నిల్వ నిర్వహణ, నగదు లావాదేవీలు, చెక్కుల రిటర్న్ ఛార్జీలు, రివార్డ్ పాయింట్లకు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నిర్ణయంతో కొన్ని రకాల ఖాతాదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
యాక్సిస్ బ్యాంక్ ఈజీ యాక్సెస్, దానికి సమానమైన దేశీయ, ఎన్నారై ఖాతాలతో పాటు కృషి, సహజ్ పొదుపు ఖాతాలకు ఈ మార్పులు వర్తిస్తాయి. ప్రస్తుతం నెలకు మొదటి నాలుగు నగదు లావాదేవీలు లేదా రూ.1 లక్ష వరకు లావాదేవీలు ఉచితం. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అక్కడితో ఉచిత పరిమితి ముగుస్తుంది. నుంచి ఉచిత నగదు లావాదేవీల సంఖ్య నాలుగు నుంచి మూడుకు తగ్గనుంది. అయితే రూ.1 లక్ష పరిమితిలో మార్పు లేదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కనీస నిల్వ నిర్వహణ ఛార్జీలు
ఖాతాలో నిర్దేశించిన సగటు నెలవారీ నిల్వను నిర్వహించకపోతే విధించే ఛార్జీల్లోనూ మార్పులు చేశారు. లోటుగా ఉన్న మొత్తంపై 6 శాతం చొప్పున ఛార్జీ లెక్కిస్తారు. అయితే గరిష్ట నెలవారీ ఛార్జీని అన్ని ప్రాంతాలకు రూ.600గా నిర్ణయించారు. ప్రస్తుతం దేశీయ ఖాతాలకు మెట్రో, పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా రూ.600, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.300, గ్రామీణ ప్రాంతాల్లో రూ.150 వసూలు చేస్తున్నారు. కొత్త విధానంతో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులకు గరిష్ట ఛార్జీ పెరగనుంది. ఎన్నారై ఈజీ యాక్సెస్ ఖాతాలకు కూడా అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఛార్జీ రూ.600గా ఉండనుంది. ఈ కనీస నిల్వ ఛార్జీలు జీతం ఖాతాదారులకు వర్తించవు.












