రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే దీక్షలకు సిద్ధమయ్యారు. ఈ నిరసన కార్యక్రమాలు రేపటి నుండి మూడు రోజుల పాటు జరగనున్నాయి.
రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద ఈ రిలే దీక్షలు చేపట్టనున్నారు. రేపటి నుండి అనగా 23, 24, 25 తేదీలలో ఈ నిరసనలు కొనసాగుతాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సీఐటీయూ (CITU) మరియు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల యూనియన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. రాజంపేట ఐసీడీఎస్ కార్యాలయం వద్ద కూడా ఈ నిరసనలు జరగనున్నట్లు సమాచారం.












