ఆర్మూర్, 2026-06-05
మాల జాతి పరిరక్షణకు మాలలందరూ ఏకం కావాలని మాల కోఆర్డినేషన్ ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎం ఎఫ్ గోపీనాథ్ పిలుపునిచ్చారు. మాలల రోస్టర్ పాయింట్ సవరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నాడు ఆర్మూర్ లో జరిగిన జిల్లా సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మాల జాతి పరిరక్షణకు మాలలందరూ ఏకం కావాలని మాల కోఆర్డినేషన్ ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎం ఎఫ్ గోపీనాథ్ పిలుపునిచ్చారు. మాలల రోస్టర్ పాయింట్ సవరించాలని డిమాండ్ చేస్తూ, ఆదివారం నాడు ఆర్మూర్ ఎంఎస్ ఫంక్షన్ హాల్ లో మాల కోఆర్డినేషన్ ఫోరమ్ జిల్లా కన్వీనర్ డి లింగన్న అధ్యక్షతన జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణ భిన్నంగా జరిగిందని తెలిపారు. ఆశించిన వర్గీకరణ జరగకపోవడం వల్ల, మాలలకు విద్య, ఉద్యోగ నియామకాలలో రోస్టర్ పాయింట్ 22 కేటాయించబడిందని, దీనివల్ల భవిష్యత్తులో మాల విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడం కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. రోస్టర్ పాయింట్ సవరించే వరకు మాలలు ఐక్యంగా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే వంటి మహనీయుల స్ఫూర్తితో ఉద్యమించాలని ఆయన కోరారు.












