యాడికి, జూన్ 30
యాడికి మండల పరిధిలో తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు చిన్నారులకు జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగిరెడ్డి, తన మిత్రబృందంతో కలిసి అండగా నిలిచారు. తండ్రి హత్య, తల్లి జైలుకు వెళ్లడంతో అనాథలైన పిల్లలకు విద్యా సామగ్రిని అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విధి ఆడిన వింత నాటకంలో తల్లిదండ్రుల ఆసరా కోల్పోయిన నలుగురు అనాథ చిన్నారులకు జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, 'మాటకోసం' ఎడిటర్ జోగిరెడ్డి తన పాత్రికేయ మిత్రబృందంతో కలిసి మానవత్వాన్ని చాటుకున్నారు. యాడికి మండల పరిధిలోని పెద్దపేట గ్రామానికి చెందిన శివప్రసాద్ ను అతని భార్య హైమావతి క్షణికావేశంలో హత్య చేయడంతో, తండ్రి మృతి చెంది తల్లి జైలుకెళ్లడంతో వారి నలుగురు పిల్లలు - ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు అనాథలుగా మారారు.












