తిరుమల పుణ్యక్షేత్రంలో ఇటీవల భక్తుల మధ్య చోటుచేసుకుంటున్న ఘర్షణలు, రాజకీయ విమర్శలు క్షేత్ర పవిత్రతకు భంగం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా క్యూలైన్లలో జరిగిన భౌతిక దాడులు ఈ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న క్యూలైన్లలో ఇద్దరు భక్తులు పరస్పరం దాడులకు దిగారు. క్యూలో ముందుకు వెళ్లే క్రమంలో తలెత్తిన చిన్నపాటి వాగ్వివాదం కాస్తా తీవ్రమై, ఒకరిపై ఒకరు బెల్టులతో దాడి చేసుకునే స్థాయికి చేరింది. అక్కడున్న శ్రీవారి సేవకులు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి వారిని నిలువరించారు. ఈ సంఘటనతో క్యూలో ఉన్న మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఘటనపై టీటీడీ అధికారికంగా స్పందిస్తూ, భక్తులు సంయమనం పాటించాలని మరియు స్వామి వారి దర్శనానికి వచ్చే సమయంలో భక్తిభావంతో ఉండాలని విజ్ఞప్తి చేసింది. భక్తుల భద్రత, సౌకర్యాలకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. అయినప్పటికీ, భక్తుల మధ్య ఘర్షణలు జరగడం టీటీడీ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.












