జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యాచరణ చేపట్టినట్లు ఆయన చెప్పారు.
జీరో డ్రగ్స్, మహిళలపై నేరాల్లో జీరో టాలరెన్స్, జీరో రోడ్ యాక్సిడెంట్స్ లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు.












