వైఎస్సార్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. కలమల్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నదండ్లూరు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, అనుమానాస్పద ప్రాంతాలను తనిఖీ చేశారు.
వైఎస్సార్ జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలమల్ల పోలీస్ స్టేషన్ సి.ఐ. విశ్వనాథ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నదండ్లూరు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ () నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సరైన రికార్డులు లేని 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.












