మైనర్ బాలిక అదృశ్యం, అపహరణ, లైంగిక దాడి కేసులో తెనాలి ప్రత్యేక పోక్సో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు శ్రీనుబాబు అలియాస్ సిద్ధుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ ఘటనకు సహకరించిన రెండో నిందితురాలు దుర్గకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు.
తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో, న్యాయమూర్తి ఈ శిక్షలను ఖరారు చేశారు. బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఈ పరిహారాన్ని అందించాలని తీర్పులో పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బాలిక అదృశ్యంపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి, సాక్ష్యాధారాలను సేకరించి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించగా, సాక్షుల విచారణ అనంతరం కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది.












