కామారెడ్డి, జూలై 28
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి, నకిలీ రబ్బరు ముద్రలు, కంప్యూటర్లు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో భిక్కనూరుకు చెందిన తోడెంగల రాజా నరేందర్, తోడెంగల రాజలింగం, బోయిని ప్రసాద్లను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ తెలిపారు.












