కామారెడ్డి, జూలై 23
కామారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో గురువారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించారు.
మైనర్ డ్రైవింగ్, మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై కళాబృందం సందేశం అందించింది.
కామారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ గంజ్ హైస్కూల్లో గురువారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.
సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లను జాగ్రత్తగా వినియోగించాలని, అపరిచితులను నమ్మి మోసపోవద్దని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.











