కామారెడ్డి, 2026-07-23
రోడ్లపైన, షాపుల పక్కన నివసిస్తూ, వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతున్న వృద్ధులు, చిన్న పిల్లల కోసం సైన్యాసేన ఆధ్వర్యంలో ఒక సహాయక కార్యక్రమం చేపట్టారు. వారికి దుప్పట్లు, బట్టలు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ రోడ్లపైన, షాపుల పక్కన నివసిస్తున్న వృద్ధులు, చిన్న పిల్లల దుస్థితిని దృష్టిలో ఉంచుకుని, వారికి కనీసం దుప్పట్ల సౌకర్యం కూడా లేకపోవడంతో, సైన్యాసేన ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన దుప్పట్లు, బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎర్రోళ్ల నరేష్ తెలిపారు.
ప్రతి మనిషి కూడా సాటి మనిషికి మేమున్నాం అనే ధైర్యాన్ని, భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.












