కడప జిల్లా న్యాయ విభాగంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సస్పెండ్ చేశారు. ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టుకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్. మున్నాజి రావు, క్రిమినల్ కేసుల నేపథ్యంలో అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదలైన తర్వాత ఈ చర్యలు తీసుకున్నారు.
రాయచోటికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్. మున్నాజి రావు, ప్రస్తుతం డిప్యుటేషన్ పై సిద్దవటం సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసుల నేపథ్యంలో పోలీసులు ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేసి న్యాయ కస్టడీకి తరలించారు. అనంతరం 18-09-2026న బెయిల్ పై విడుదలయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం చర్యలు












