తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 55 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్‌తో అపస్మారక స్థితిలో పడి ఉండగా, 108 అంబులెన్స్ సిబ్బంది రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
చంద్రగిరి పట్టణంలోని కోట సమీపంలో 18-10-2026వ తేదీ రాత్రి సుమారు 10:00 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 108 అంబులెన్స్ సిబ్బంది సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి 22-10-2026వ తేదీ రాత్రి సుమారు 8:40 గంటలకు మృతి చెందారు. ప్రస్తుతం తిరుపతిలోని మెడికల్ కాలేజ్ మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచి ఉంచినట్లు చంద్రగిరి పోలీసులు తెలిపారు.












