కామారెడ్డి, జూలై 28
ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్లలో నకిలీ ధృవీకరణ పత్రాలను తయారు చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు, కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ రికార్డులు వంటి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ వెల్లడించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్లలో నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు, కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ రికార్డులు వంటి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ వెల్లడించారు.
జూలై 22న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కామారెడ్డిలో ఆర్ఎంఓగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చందారి సంతోష్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తన పేరుతో, అధికారిక హోదాతో జారీ చేసినట్లు కనిపించే వయస్సు, మొదటి వివాహ ధృవీకరణ పత్రాలపై తనకు సంబంధం లేకుండా నకిలీ సంతకాలు చేసి, అధికారిక రబ్బరు ముద్రను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నకిలీ పత్రాలను కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఆర్థిక సహాయం పొందేందుకు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.











