మరో
పంజాబ్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని నల్లటి స్కార్పియో వాహనంతో ఢీకొట్టి, అనంతరం కొందరు వ్యక్తులు బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతడి మృతదేహం జిల్లాలో లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసులు, మీడియా కథనాల ప్రకారం, మృతుడిని పటియాలా జిల్లాలోని డకలా గ్రామానికి చెందిన 27 ఏళ్ల నవాబ్ ఖాన్‌గా గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా పటియాలాసంగ్రూర్ రహదారిపై ఓ పెట్రోల్ బంకు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నల్లటి మహీంద్రా స్కార్పియో వాహనం ఎదురుగా వచ్చి ఆయన బైక్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.












