నెల్లూరు
గూడూరు అటవీ పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 8 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 61 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ కు ఉపయోగించిన ఒక ట్రాక్టర్, రెండు కార్లను కూడా సీజ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో, డీఎస్పీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో కృపానంద, ఎఫ్ఆర్వో సుభాష్ గూడూరు అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. కొండగుంట-మేకనూరు మార్గంలో వెళుతుండగా వారికి అలికిడి వినిపించింది. అటు వైపు వెళ్లి చూడగా, కొంతమంది ఎర్రచందనం దుంగలతో ఉన్న ట్రాక్టర్ తో కనిపించారు. సమీపంలో రెండు కార్లు కూడా ఉండటంతో, పోలీసులు వారిని చుట్టుముట్టారు. ట్రాక్టర్ లో 24, కింద 22 దుంగలు కలిపి మొత్తం 46 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, మరో ప్రాంతంలో దాచి ఉంచిన మరో 15 ఎర్రచందనం దుంగలను కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.












