తిరుపతి, 2024-06-29
తుమ్మలగుంటకు చెందిన లిఖిత్ సాయి (12), ఉదయ్ సాయి (8) అనే ఇద్దరు చిన్నారులు స్కేటింగ్కు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి, రైల్వే స్టేషన్లో సైకిళ్లు వదిలి నరసాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో నెల్లూరు వెళ్లిపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, గంటల వ్యవధిలోనే వారిని సురక్షితంగా గుర్తించారు.
తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను కొద్ది గంటల వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించిన తిరుపతి జిల్లా పోలీసులు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో వేగవంతమైన పోలీస్ ఆపరేషన్ చేపట్టారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఐపీఎస్ ఆదేశాలు, ప్రత్యక్ష పర్యవేక్షణలో తిరుపతి జిల్లా పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను గంటల వ్యవధిలోనే నెల్లూరులో సురక్షితంగా గుర్తించి వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.
తుమ్మలగుంట ప్రాంతానికి చెందిన లిఖిత్ సాయి (12), ఉదయ్ సాయి (8) స్కేటింగ్కు వెళ్తున్నట్లు ఇంటి నుంచి బయలుదేరి, రైల్వే స్టేషన్లో సైకిళ్లను ఉంచి ఎవరికీ చెప్పకుండా నరసాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో వెళ్లిపోయారు. పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఎం.ఆర్.పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.












