విజయవాడ గ్రామీణం, 29-06-2026
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రాంగణంలో "I ❤️ Dr. NTR UHS" (ఐ లవ్ డా. ఎన్టీఆర్ యూహెఎచ్ఎస్) పేరుతో ప్రత్యేక సెల్ఫీ పాయింట్‌ను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా. పి. చంద్రశేఖర్ సోమవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సెల్ఫీ పాయింట్ విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేస్తుందని, అనుబంధాన్ని చిరస్మరణీయంగా నిలుపుతుందని తెలిపారు.
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రాంగణంలో "I ❤️ Dr. NTR UHS" (ఐ లవ్ డా. ఎన్టీఆర్ యూహెఎచ్ఎస్) పేరుతో ప్రత్యేక సెల్ఫీ పాయింట్‌ను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా. పి. చంద్రశేఖర్ సోమవారం ఉదయం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డా. పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్య, వైద్యం, పరిశోధన రంగాల్లో దేశవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ సెల్ఫీ పాయింట్ విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేస్తుందనే ఉద్దేశ్యంతో దీనిని ఆవిష్కరించినట్లు చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, సందర్శకులు విశ్వవిద్యాలయంతో తమ అనుబంధాన్ని చిరస్మరణీయంగా నిలుపుకునేందుకు ఈ సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. విశ్వవిద్యాలయ గుర్తింపును మరింత పెంపొందించడంతో పాటు, సంస్థ పట్ల ఆత్మీయతను, గర్వాన్ని ప్రతిబింబించేలా దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు.












