జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలను పురస్కరించుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమ నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. విగ్రహాలను తరలించే వాహనాల్లో అధిక సంఖ్యలో ప్రయాణించవద్దని, వాహనాలపై ప్రమాదకరంగా నిలబడవద్దని హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బారికేడ్లను దాటి నీటిలోకి వెళ్లవద్దని, ఈత రానివారు నీటి జోలికి వెళ్లవద్దని, పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఊరేగింపుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సహకరించాలని, డీజే శబ్ద కాలుష్య నిబంధనలను పాటించాలని సూచించారు.












