వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పోలీసులు వినూత్న ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందిరాచౌక్ వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్‌ను వినాయక మండపంగా మార్చి, ట్రాఫిక్ వినాయకుడును ఏర్పాటు చేశారు. భక్తి మార్గంలో ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
కామారెడ్డి టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ ఆలోచన మేరకు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఇందిరాచౌక్ ట్రాఫిక్ బూత్‌ను వినాయక మండపంగా తీర్చిదిద్ది, ట్రాఫిక్ విధుల్లో ఉన్నట్లుగా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు బూత్‌లో విధులు నిర్వహిస్తూ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ ప్రజల భద్రతకు కృషి చేస్తుంటారు. అదే విధంగా వినాయకుడిని కూడా ట్రాఫిక్ అవతారంలో, ట్రాఫిక్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్నట్లుగా రూపొందించారు.











