గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం పట్టణంలో పర్యటించి, గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, ప్రజలు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చేపడుతున్న చర్యలను ఆయన అభినందించారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం కలెక్టర్, ఎస్పీ కలిసి, గణేష్ నిమజ్జనం కోసం రూపొందించిన రూట్ మ్యాప్‌ను ప్రత్యేక బస్సులో ప్రయాణిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలు, ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.












