జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తుతో పాటు ఈ-సాక్ష్యా తప్పనిసరిగా నమోదు చేయాలని, చట్టపరమైన గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేసి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రతి మండపాన్ని పోలీసులు ప్రతిరోజూ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని, మండపాల వద్ద 24 గంటల పాటు గస్తీ నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన భద్రతా సూచనలు అందించాలని సూచించారు.












