విద్యార్థులు తమ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, శక్తి బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా, బుధవారం కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.శ్రీలత, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ఎం.తమీమ్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, విద్యార్థులకు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ నేరాలు, ప్రేమ వ్యవహారాలు, ఒత్తిడి, ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సమాజంలో జరుగుతున్న వాస్తవ ఘటనలు, కేసుల ఉదాహరణలతో విద్యార్థులను అప్రమత్తం చేశారు. వ్యక్తిగత లేదా చదువుకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు నిరాశతో తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.












