గాంధారి, 4 September
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగానే ఉచితంగా ఏకరూప దుస్తులు అందిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్, వార్డు మెంబర్ మేల్డే లక్ష్మన్ అన్నారు. ఇది విద్యార్థుల్లో సమానత్వ భావనను పెంపొందించడంతో పాటు, పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్, వార్డు మెంబర్ మేల్డే లక్ష్మన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు అందించడం ద్వారా సమానత్వ భావనను పెంపొందించడంతోపాటు పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తోందని పేర్కొన్నారు. మండలం గౌరారం గ్రామంలోని ఎంపీపీఎస్ ఎక్కకుంట తాండ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేల్డే లక్ష్మన్ విద్యార్థులకు యూనిఫారాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏకరూప దుస్తులు విద్యార్థుల్లో సమానత్వానికి ప్రతీకగా నిలుస్తాయని, విద్య ప్రతి విద్యార్థి బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల చిరునవ్వే సమాజ భవిష్యత్తుకు వెలుగుబాట అని అన్నారు. కార్యక్రమంలో సీసీ రమేష్, ఉపాధ్యాయులు మదన్, రమేష్, మహిళా సంఘాల సభ్యులు, స్థానికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












