మాచారెడ్డి, 5 September
కామారెడ్డి జిల్లా మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అల్లాడి సౌజన్యను జిల్లా బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపిక చేశారు. విద్యార్థుల విద్యా ప్రగతి, వ్యక్తిత్వ వికాసం, సమగ్ర అభివృద్ధికి ఆమె చేస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా బెస్ట్ టీచర్‌గా అల్లాడి సౌజన్య జిల్లా బెస్ట్ టీచర్‌గా అల్లాడి సౌజన్య కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న అల్లాడి సౌజన్యను కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపిక చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి విద్యా ప్రగతి, వ్యక్తిత్వ వికాసం, సమగ్ర అభివృద్ధి కోసం అంకితభావంతో చేస్తున్న సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. బోధనలో వినూత్న పద్ధతులను అనుసరిస్తూ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంలో ఆమె చేస్తున్న కృషి ప్రశంసనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు ఆమెను అభినందిస్తూ, భవిష్యత్తులోనూ విద్యారంగంలో మరింత విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు.












