కామారెడ్డి, జూలై 25, 2026
భారత ప్రభుత్వ యువ వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'మై భారత్' (MY Bharat – Mera Yuva Bharat) పోర్టల్‌లో యువత పెద్ద సంఖ్యలో నమోదు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి పిలుపునిచ్చారు. స్వచ్ఛంద సేవ, నైపుణ్యాభివృద్ధి, జాతీయ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరుగుతోంది.
స్వచ్ఛంద సేవ, నైపుణ్యాభివృద్ధి, జాతీయ నిర్మాణంలో భాగస్వామ్యానికి సువర్ణావకాశం కల్పించే 'మై భారత్' (MY Bharat – Mera Yuva Bharat) పోర్టల్‌లో యువత పెద్ద సంఖ్యలో నమోదు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ యువ వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్‌ను నిర్వహిస్తోంది.
జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి ఆగస్టు 15, 2026 వరకు "MY Bharat Intensive Youth Registration & Awareness Drive" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, నాయకత్వ వికాస కార్యక్రమాలు, జాతీయ స్థాయి యువజన కార్యక్రమాల్లో భాగస్వామ్యం, వాలంటీరింగ్ అవకాశాలు, వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో భాగస్వామ్యం, అలాగే బ్లాక్, జిల్లా స్థాయి క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయి.











