నంద్యాల, జూన్ 27
రానున్న పదో తరగతి పరీక్షల్లో జిల్లాకు మెరుగైన ఫలితాలు సాధించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ప్రధానోపాధ్యాయులకు సూచించారు. శనివారం జిల్లా మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఈ మేరకు సమీక్ష సమావేశం జరిగింది.
రానున్న పదో తరగతి పరీక్షల్లో జిల్లాకు మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శనివారం జిల్లా మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలు, తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.












