టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్ను చెన్నైలో కలిశారు. తమ తాజా చిత్రం రణబాలి విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ముగ్గురూ కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
ఈ భేటీ అనంతరం రష్మిక మందన్న తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత విజయ్ను కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో ఆయనకు అభిమానిగా ఉన్నానని, ఇప్పుడు నటుడిగా మాత్రమే కాకుండా ముఖ్యమంత్రిగా ఆయన ప్రయాణాన్ని కూడా గౌరవిస్తున్నానని తెలిపారు. ఆయన ఎదుగుదల స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విజయ్ దేవరకొండ స్పందన
విజయ్ దేవరకొండ కూడా ఈ సమావేశంపై స్పందించారు. రోజంతా పని చేసినప్పటికీ తమను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారని, జీవితం, పని, ప్రపంచం గురించి తన ఆలోచనలను పంచుకున్నారని తెలిపారు. ఒక్క సమావేశంతోనే విజయ్ తనకు మరింత ఇష్టమైన వ్యక్తిగా మారారని పేర్కొంటూ ఆయనపై ప్రేమ, గౌరవాన్ని వ్యక్తం చేశారు.












