ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్ తన భర్త గౌతమ్ హతీరమణితో విడిపోతున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎంతో ఆలోచించిన తర్వాత ఇద్దరం విడివిడిగా జీవించాలని నిర్ణయించుకున్నామని ఆమె పేర్కొన్నారు. కలిసి గడిపిన సమయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో గోప్యతను గౌరవించాలని అభిమానులు, సన్నిహితులను కోరారు. కనికా, గౌతమ్ 2020లో లండన్‌లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ దాదాపు 15 ఏళ్ల పరిచయం ఉంది. స్నేహం ప్రేమగా మారిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు కనికాకు రాజ్ చందోక్‌తో వివాహం జరిగింది. ఈ బంధం 2012లో ముగిసింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. బేబీ డాల్, లవ్లీ, చిట్టియాన్ కలైయాన్ వంటి పాటలతో కనికా బాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్ తన భర్త గౌతమ్ హతీరమణితో విడిపోతున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ఆమె ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.












