బాలీవుడ్ నటి కృతి సనన్ తన వ్యక్తిత్వ హక్కులకు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ముఖచిత్రం, గొంతు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా రక్షణ కల్పించాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, వ్యక్తిత్వ హక్కుల పరిధిని వివరించే గత తీర్పులు, న్యాయ పరిశోధన పత్రాలను సమర్పించాలని సూచించింది. జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ ఈ కేసును విచారించారు. కృతి సనన్ తరఫున న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ వాదనలు వినిపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కోర్టు ప్రశ్నలు
వ్యక్తిత్వ హక్కుల కింద ఏయే అంశాలకు రక్షణ కల్పించవచ్చు ఒక వ్యక్తి పేరు, గొంతు, ముఖం, ఫొటోలు, వీడియోల వినియోగంపై ఎలాంటి పరిమితులు వర్తిస్తాయి అనే అంశాలపై న్యాయస్థానం స్పష్టత కోరింది. ఒక వ్యక్తి గుర్తింపును వారి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం కూడా వ్యక్తిత్వ హక్కుల పరిధిలోకి వస్తుందని కృతి తరఫు న్యాయవాది వివరించారు.












