జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్, సోమాజిగూడలో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వివేకానంద ఆధ్వర్యంలో రోబోటిక్ సాంకేతికతతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆర్థరైటిస్, వయసు పెరగడం, మోకాలి వైకల్యం వంటి కారణాలతో బాధపడుతున్న వారికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ఉపశమనం కలిగిస్తోంది. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే రోబోటిక్ సహాయక శస్త్రచికిత్సలో అధిక కచ్చితత్వం, కంప్యూటర్ ఆధారిత మార్గదర్శకత్వం, వ్యక్తిగత 3డీ ప్రణాళిక వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రోబోట్ ద్వారా ప్రతి రోగి మోకాలి నిర్మాణానికి అనుగుణంగా శస్త్రచికిత్సను ముందుగానే ప్రణాళిక చేయడంతో ఇంప్లాంట్‌ను ఖచ్చితమైన స్థానంలో అమర్చేందుకు సహాయపడుతుందని డాక్టర్ వివేకానంద తెలిపారు. దీని వల్ల చుట్టుపక్కల కణజాలానికి తక్కువ నష్టం, తక్కువ నొప్పి, వేగవంతమైన కోలుకోవడం, రోజువారీ కార్యకలాపాలకు త్వరగా తిరిగి చేరుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.












