అన్నమయ్య జిల్లా మండలంలో పాముకాటుకు గురైన వారికి నాటు వైద్యం చేయవద్దని, వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని వైద్యాధికారులు సూచించారు. మూఢనమ్మకాలతో చేసే చికిత్స ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.
మండలం దొడ్డివారిపల్లి గ్రామంలో పాముకాటుపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తలపుల పీహెచ్సీ డిప్యూటీ హెచ్ఐవో కొండయ్య మాట్లాడుతూ, పాము కాటు వేసిన వెంటనే ఆలస్యం చేయకుండా బాధితుడిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో పాముకాటుకు విరుగుడు ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, భయపడకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నాటు వైద్యంపై హెచ్చరిక












