రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి విద్యకు అత్యాధునిక కార్-టీ సెల్ థెరపీ (- ) ద్వారా చికిత్స అందించి వైద్యులు కొత్త ఆశలు నింపారు. గతంలో విఫలమైన చికిత్సల తర్వాత ఈ ఆధునిక వైద్యంతో ఉపశమనం లభించింది.
చిన్నారి విద్యకు అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా () ఉన్నట్లు నిర్ధారణ అయింది. గతంలో కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వంటి చికిత్సలు చేసినప్పటికీ వ్యాధి తగ్గకపోవడంతో కార్-టీ చికిత్సను చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ గణేష్ ఎస్. జైశేత్వార్ పర్యవేక్షణలో ఈ చికిత్స అందించారు. కార్-టీ చికిత్సలో భాగంగా, రోగి శరీరంలోని తెల్ల రక్తకణాలను సేకరించి, ప్రయోగశాలలో ప్రత్యేకంగా మార్పు చేసి, క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసేలా సిద్ధం చేస్తారు. అనంతరం, ఈ మార్పు చేసిన కణాలను తిరిగి రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు.












