హైదరాబాద్ మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్ లో నూతనంగా సుప్రజ హాస్పిటల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ (పిఎంఎల్టిఏ) ప్రతినిధులు హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సుప్రజ హాస్పిటల్ ను పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ (పిఎంఎల్టిఏ) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పులసరి వీరయ్య ఆదేశాల మేరకు, అసోసియేషన్ రాష్ట్ర ఎలక్ట్రాన్ మీడియా ఇంచార్జ్ టి. మధువన్ సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా, వారు సుప్రజ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సిగ విజయ్ కుమార్ గౌడ్ కు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సేవలను వారు అభినందించారు. అలాగే, సుప్రజ హాస్పిటల్స్ మార్కెటింగ్ ఏజీఎం మల్లేష్ గారిని కూడా అసోసియేషన్ ప్రతినిధులు సన్మానించి, నూతన ఆసుపత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి











