కేరళలోని త్రిస్సూర్‌లో కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఒక వ్యక్తికి, నిర్దేశిత 72 గంటల నిబంధనను 70 గంటలే పూర్తి చేశారనే కారణంతో బీమా సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించింది. ఈ వ్యవహారంపై వినియోగదారుల ఫోరం కీలక తీర్పు వెలువరించింది.
త్రిస్సూర్‌లో కరోనాకు చికిత్స పొందిన ఒక రోగి, ఆసుపత్రిలో 72 గంటలు ఉండాలన్న బీమా నిబంధనను 70 గంటలే పూర్తి చేశారనే సాకుతో లక్ష రూపాయల క్లెయిమ్‌ను బీమా సంస్థ తిరస్కరించింది. ఈ నిర్ణయంతో అసంతృప్తి చెందిన బాధితుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కేసును విచారించిన వినియోగదారుల కమిషన్, ఆధునిక వైద్యంలో చికిత్సా పద్ధతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, తక్కువ సమయంలోనే రోగులు కోలుకోవడం శుభపరిణామమని పేర్కొంది. కేవలం రెండున్నర గంటల వ్యత్యాసం కోసం క్లెయిమ్‌ను నిరాకరించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని కమిషన్ స్పష్టం చేసింది.











