జిల్లాలో రాబోయే నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో, జూన్ 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పోలియో నిర్మూలన సాధ్యమవుతుందని, ప్రతి బిడ్డకు రెండు చుక్కల పోలియో చుక్కలు వేయించడం మన బాధ్యత అని ఆయన అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలియో నిర్మూలనలో భాగంగా, జిల్లాలోని అన్ని బూత్‌లతో పాటు, రద్దీగా ఉండే ప్రదేశాలలోనూ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. 28వ తేదీన బూత్‌లు, మొబైల్ టీమ్‌ల ద్వారా, ఆ తర్వాత రెండు రోజులు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తారు.











