కామారెడ్డి, ఆదివారం
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆదివారం ఉదయం 9 గంటల నుండి రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో గంప శశాంక్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు.
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం ఆధ్వర్యంలో గంప శశాంక్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. తలసేమియా చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉంటుందని, ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడటానికి రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరానికి సహకరిస్తున్న యువజన విభాగానికి కృతజ్ఞతలు తెలియజేశారు.











