అమెరికా విధానాలపై తమ వైఖరిలో మార్పు ఉండబోదని, వాషింగ్టన్ విధానాలకు మరింత బలంగా స్పందిస్తామని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరించారు. అమెరికా విధానాలను ఉత్తర కొరియా ఇప్పటికీ శత్రుత్వపూరితంగానే చూస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఉత్తర కొరియా తన తూర్పు తీరానికి సమీపంలో గుర్తుతెలియని ప్రక్షేపకాన్ని ప్రయోగించింది.
అమెరికా పట్ల తమ వైఖరిలో మార్పు ఉండబోదని, వాషింగ్టన్ కొనసాగిస్తున్న విధానాలకు మరింత బలంగా స్పందిస్తామని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికా విధానాలను ఉత్తర కొరియా ఇప్పటికీ శత్రుత్వపూరితంగానే చూస్తోందని ఆమె పేర్కొన్నట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అమెరికాతో చర్చలు జరిపే విషయంలో ప్యాంగ్యాంగ్ ఆసక్తి చూపడం లేదని ఆమె వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉండగా, ఈ ప్రకటనలు దౌత్యపరమైన చర్చలకు మరింత అడ్డంకిగా మారే అవకాశం ఉంది.












