యూరప్‌లోని పలు దేశాల్లో సూపర్మార్కెట్ల శీతలీకరణ వ్యవస్థలపై అనుమానిత సైబర్ దాడులు కలకలం రేపుతున్నాయి. స్వీడన్, బెల్జియంతో పాటు మరికొన్ని దేశాల్లోని దుకాణాల్లో ఫ్రిజ్‌లు, ఫ్రీజర్ల ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతో ఆహార పదార్థాలు పాడయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనల వెనుక సైబర్ దాడులు ఉండవచ్చని అధికారులు, సంబంధిత సంస్థలు అనుమానిస్తున్నాయి.
సూపర్మార్కెట్లలో శీతలీకరణ పరికరాలను నియంత్రించే డిజిటల్ వ్యవస్థల్లోకి చొరబడి, వాటి సెట్టింగ్‌లను మార్చినట్లు అనుమానిస్తున్నారు. బెల్జియంలోని కొన్ని దుకాణాల్లో ఫ్రిజ్‌ల వ్యవస్థలు డీఫ్రాస్ట్ మోడ్‌లోకి మారడంతో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు శీతలీకరణ సంస్థ సాబ్కోబెల్ () అధిపతి స్టీఫన్ మోలెన్స్ తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభావానికి గురైన సూపర్మార్కెట్లు
బెల్జియంలో డెల్హైజ్ (), క్యారీఫోర్ (), స్పార్ () వంటి సంస్థలకు చెందిన కొన్ని దుకాణాల్లో సమస్యలు తలెత్తాయి. స్వీడన్లో ఐసీఏ (), కోప్ () సూపర్మార్కెట్లలోనూ ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. ఐర్లాండ్‌లో సూపర్వాల్యూ () సంస్థకు చెందిన 13 దుకాణాల్లో నిర్దిష్ట నమూనా శీతలీకరణ పరికరాలు ప్రభావితమైనట్లు సంస్థ వెల్లడించింది.












