ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి పండుగను ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో భద్రతా దళాల సిబ్బందితో కలిసి జరుపుకున్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్న సైనికులు, భద్రతా సిబ్బందితో ముచ్చటించి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. బస్తర్‌లోని కరణ్‌పూర్‌లో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపును సందర్శించిన మోదీ, అక్కడి జవాన్లతో పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
దేశం కోసం వారు చేస్తున్న త్యాగాలు, నిస్వార్థ సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. ఒకప్పుడు నక్సలిజం ప్రభావంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న బస్తర్ ప్రాంతం ప్రస్తుతం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నక్సలిజం ప్రభావం తగ్గించడంలో భద్రతా బలగాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. వారి ధైర్యం, అంకితభావం, త్యాగాల వల్ల ప్రజల్లో భద్రతపై నమ్మకం పెరిగిందని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సైనికులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. దేశ సరిహద్దులను కాపాడుతున్న వారు, దేశంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తున్న వారు తన కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. దేశ ప్రజల తరఫున భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేయడానికి బస్తర్‌కు వచ్చినట్లు చెప్పారు. గత ఏడాది కాలంలో విధి నిర్వహణలో ఒక్క సీఆర్పీఎఫ్ జవాను కూడా ప్రాణాలు కోల్పోలేదని మోదీ పేర్కొన్నారు. ఇది భద్రతా బలగాల ధైర్యసాహసాలకు, దేశ భద్రతా విధానాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. నక్సలిజాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలని యువతకు పిలుపునిచ్చారు. హింసకు దూరంగా ఉండి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.










