జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక రావడంతో కలకలం రేగింది. ముందు జాగ్రత్త చర్యగా రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా దింపారు. భద్రతా సంస్థలు విమానాన్ని, ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పటికీ అనుమానాస్పద వస్తువులేవీ లభించలేదు.
ఎయిర్ ఇండియా ఏఐ2030 విమానం ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తుండగా, అహ్మదాబాద్ విమాన ట్రాఫిక్ నియంత్రణ కేంద్రానికి హైజాక్ హెచ్చరిక సంకేతం అందింది. విమానాన్ని గుర్తించేందుకు ఉపయోగించే ట్రాన్స్పాండర్లోని 7500 కోడ్ హైజాక్ను లేదా విమానంపై అక్రమ జోక్యాన్ని సూచిస్తుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ సంకేతం అందడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. విమానాన్ని జైపూర్ విమానాశ్రయానికి మళ్లించి ప్రత్యేక ప్రాంతంలో దింపారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని తనిఖీ చేయడంతో పాటు విమానం, సామాన్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.












