ఓబీసీ క్రీమీ లేయర్ నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. కేవలం తల్లిదండ్రుల జీతాన్ని మాత్రమే కాకుండా, వారి ఉద్యోగం, హోదా, సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 అభ్యర్థులకు ముఖ్యమైనది.
ఓబీసీ క్రీమీ లేయర్ నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. కేవలం తల్లిదండ్రుల జీతాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని అభ్యర్థులను క్రీమీ లేయర్ పరిధిలోకి తీసుకురావడం సరికాదని కోర్టు పేర్కొంది. తల్లిదండ్రులు పనిచేసే ఉద్యోగం, హోదా, పోస్టు స్థాయి, సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల సమయం కోరింది. అయితే, సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అమలుకు గతంలో ఇచ్చిన ఆరు నెలల గడువును మరో ఎనిమిది వారాలకు పొడిగించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 అభ్యర్థులకు ఈ తీర్పు చాలా కీలకం. ఇంకా సర్వీసుల కేటాయింపు పూర్తికాని నేపథ్యంలో, కొత్త క్రీమీ లేయర్ నిబంధనల ప్రకారమే ఓబీసీ అభ్యర్థులకు సర్వీసులు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఇప్పటికే పూర్తయిన నియామకాలు, ఎంపికలు, ఇతరుల సీనియారిటీని తిరిగి పరిశీలించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఓబీసీ అభ్యర్థుల సర్వీసు కేటాయింపుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.











